యలమంచిలి రూరల్ ఏటికొప్పాక గ్రామం ఇలవేల్పు అయినటువంటి శ్రీ శ్రీ బండిమాంబ అమ్మవారిని బుధవారం నాడు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యలమంచిలి నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం-బీజేపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సుందరపు విజయ్ కుమార్ కుటుంబ సమేతంగా విచ్చేసి.... అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోను అమ్మవారి ముందు పెట్టి ఇక్కడి నుంచే రాబోయే ఎన్నికలకు ఎన్నికల శంఖారావం పూరించారు.
పవిత్రమైన కార్తీక మాసంలో వెలిగించిన దీపకాంతులు ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ... కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
2024-11-15 14:46:36
అమరావతి సచివాలయం నందు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన యలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్, యలమంచిలి నియోజకవర్గ పరిధిలో గల సమస్యల పై చర్చించడం జరిగింది, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు సానుకూలంగా స్పందించారు.
2024-11-14 10:22:20
ప్రత్యేక ఆహ్వానం తేదీ 14/11/2024 అనగా గురువారం నాడు రాంబిల్లి మండలం కొత్తూరు గ్రామంలో మా కుటుంబ ఇలవేల్పు అయినటువంటి శ్రీశ్రీశ్రీ గుమ్ముడమ్మలు తల్లి అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా ఎలమంచిలి నియోజకవర్గ జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు కార్యకర్తలు గురువారం సాయంత్రం కొత్తూరు గ్రామానికి నా యొక్క ఆహ్వానం మేరకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరుచున్నాను ఇట్లు మీ సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు
2024-11-13 11:02:01
పెన్షన్ తీసుకోకపోతే ఆ నెల డబ్బు పోతుందనే టెన్షన్ ఇక వద్దు అంటూ భరోసా ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఒక నెల పెన్షన్ తీసుకుపోతే రెండో నెలలో కలిపి తీసుకోవచ్చు, మూడో నెలలో అయితే మూడు నెలల పెన్షన్ డబ్బు ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించింది కూటమి ప్రభుత్వం
2024-11-04 17:03:03