రాంబిల్లి మండలం మామిడివాడ గ్రామం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మట్టా అప్పలనర్సమ్మ, మాజీ సర్పంచులు బొడ్డేడ భాస్కరరావు, చందర సూరిబాబు, మాజీ వార్డు సభ్యులు చుక్కా నలమారి, సీనియర్ నాయకులు ఆడారి పరమేశ్వరరావు, అనుచర వర్గంతో అధికార పార్టీని వీడి వెంకటాపురంలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎలమంచిలి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొందరు విజయకుమార్ గారి అధ్యక్షతన జనసేన పార్టీలో చేరారు చేరికలు అనంతరం సుందర విజయకుమార్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీని పూర్తిగా నిర్వీర్యం చేసిందని పంచాయతీ ఎన్నికలను పథకాలు పంచడానికి వాడుకుందని దీనివలన గ్రామంలో సర్పంచులు పనులు చేయలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అధికార పార్టీపై విసుకు చెందిన సర్పంచులు అధికార పార్టీకి రాజీనామాలు చేసి ప్రతిపక్ష పార్టీలలోకి చేరుతున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పప్పల నూకన్న దొర, వురిటి నానాజీ తదితరులు పాల్గొన్నారు.
పవిత్రమైన కార్తీక మాసంలో వెలిగించిన దీపకాంతులు ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ... కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
2024-11-15 14:46:36
అమరావతి సచివాలయం నందు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన యలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్, యలమంచిలి నియోజకవర్గ పరిధిలో గల సమస్యల పై చర్చించడం జరిగింది, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు సానుకూలంగా స్పందించారు.
2024-11-14 10:22:20
ప్రత్యేక ఆహ్వానం తేదీ 14/11/2024 అనగా గురువారం నాడు రాంబిల్లి మండలం కొత్తూరు గ్రామంలో మా కుటుంబ ఇలవేల్పు అయినటువంటి శ్రీశ్రీశ్రీ గుమ్ముడమ్మలు తల్లి అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా ఎలమంచిలి నియోజకవర్గ జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు కార్యకర్తలు గురువారం సాయంత్రం కొత్తూరు గ్రామానికి నా యొక్క ఆహ్వానం మేరకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరుచున్నాను ఇట్లు మీ సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు
2024-11-13 11:02:01
పెన్షన్ తీసుకోకపోతే ఆ నెల డబ్బు పోతుందనే టెన్షన్ ఇక వద్దు అంటూ భరోసా ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఒక నెల పెన్షన్ తీసుకుపోతే రెండో నెలలో కలిపి తీసుకోవచ్చు, మూడో నెలలో అయితే మూడు నెలల పెన్షన్ డబ్బు ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించింది కూటమి ప్రభుత్వం
2024-11-04 17:03:03